This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మూత్రంలో ఎపిథీలియల్ కణాలు

Pregnancy
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: May 29, 2026
మూత్రంలో ఎపిథీలియల్ కణాలు
Likes2 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ఎపిథీలియల్ కణాలు శరీరాన్ని లోపలి, బయటి నుంచి కప్పి ఉంచే కణాలు. మూత్రంలో పరిమిత సంఖ్యలో ఇవి ఉండడం సహజం, కానీ అధిక సంఖ్య సమస్యకు సంకేతం.
  • మూత్రంలో ఎపిథీలియల్ కణాలు అధికంగా ఉండడానికి ప్రధాన కారణాలు నమూనా కాలుష్యం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), కిడ్నీ సమస్యలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్, లివర్ వ్యాధి కావొచ్చు.
  • చికిత్సలో UTI కోసం యాంటీబయాటిక్స్, జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం ఉంటాయి. హైడ్రేటెడ్​గా ఉండడం, క్రాన్​బెర్రీ జ్యూస్ తాగడం నివారణకు సహాయపడతాయి.
  • మూత్ర నాళాల ఆరోగ్యానికి ఏ ఉత్పత్తులు సహాయపడతాయి? Explore our Baby Wellness Kit | Skincare Gift Set for Newborns.
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
Rating4.3

అసలు ఎపిథీలియల్ కణాలు అంటే ఏమిటి?

ఎపిథీలియల్ కణాలు అనేవి మీ శరీరాన్ని లోపలి నుంచి మరియు బయటి నుంచి కప్పి ఉంచుతాయి. వివిధ రకాల వైరస్​ల నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. ఎపిథీలియల్ కణాలు చర్మం, జీర్ణవ్యవస్థ, రక్తనాళాలు, మూత్ర నాళాలు మొదలయిన అవయవాలలో కనిపిస్తాయి. మూత్రనాళాల్లో పరిమిత సంఖ్యలో ఎపిథీలియల్ కణాలు ఉండడం సహజం. కానీ ఎక్కువ సంఖ్యలో ఎపిథీలియల్ కణాలు మూత్రనాళాల ఇన్ఫెక్షన్, కిడ్నీ వ్యాధులు లేదా ఇతర అనారోగ్య పరిస్థితికి కారణం.

రక్తంలో ఎపిథీలియల్ కణాలు

మూత్రంలో కొన్ని ఎపిథీలియల్ కణాలు ఉండడం పూర్తి సాధారణం. ఏదేమైనా మూత్రంలో సాధారణం కంటే అధిక మోతాదులో ఎపిథీలియల్ కణాలు ఉండడం ఏదైనా మూత్ర ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వ్యాధి లేదా ఇతర ఏదైనా వ్యాధికి సంకేతం కావొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మూత్రపరీక్ష చేయమని డాక్టర్ సిఫారసు చేస్తారు. ఎపిథీలియల్ కణాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయా? లేదా? అని కణాలు తనిఖీ చేయబడతాయి.

మూత్రంలో ఎపిథీలియల్ కణాలు ఉండేందుకు కారణాలు

  • నమూనా కాలుష్యం

కొన్ని సార్లు శుభ్రపరచని కప్పులో మీ మూత్ర నమూనా సేకరించడం ద్వారా అది కలుషితం అవుతుంది. కొన్ని సందర్భాలలో మూత్రంలో ఎపిథీలియల్ కణాలు శుభ్రం చేయని జననాంగాల కారణంగా కూడా ఉంటాయి. ఇటువంటి సందర్భంలో మూత్ర నమూనా కలుషితమైతే ఖచ్చితమైన ఫలితాన్ని పొందేందుకు మరోసారి పరీక్ష చేయించుకోండి.

  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)

ఎక్కువ సార్లు మూత్రంలో అధిక ఎపిథీలియల్ కణాలు ఉన్నట్లయితే అది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వల్ల వస్తుంది. కొన్ని సార్లు సూక్ష్మజీవుల ఉనికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శ్లేష్మ తీగలు కూడా ఉంటాయి.

  • కిడ్నీ సమస్యలు

ఏవైనా మూత్రపిండ సమస్యలు ఉంటే.. మూత్రం నమూనాలో ఎపిథీలియల్ కణాల గొట్టపు లేదా స్తంభ ఆకారాలు గమనించబడతాయి. స్తంభాలు, గొట్టపు ఆకారంలో ఉండే కణాలు మూత్రపిండాలలో సాధారణంగా కనిపిస్తాయి. మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపెట్టే తీవ్రమైన వ్యాధికి సంకేతం కావొచ్చు.

మూత్రంలో ఉండే ఎపిథీలియల్ కణాల రకాలు

మూత్రంలో మూడు రకాల ఎపిథీలియల్ కణాలు ఉంటాయి. అవి పొలుసుల ఎపిథీలియల్ కణాలు: ఈ కణాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి సాధారణంగా యోని, మూత్రనాళంలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కాలుష్యం కారణంగా కనిపిస్తాయి. మూత్రపిండ గొట్టపు కణాలు: ఈ కణాల పరిమాణంలో కనుక పెరుగుదల ఉంటే అది మూత్రపిండాల రుగ్మతను సూచిస్తుంది. ట్రాన్సిషనల్ (పరివర్తన) ఎపిథీలియల్ కణాలు: ఈ కణాలు మగవారి మూత్రాశయం, మూత్రపిండ పెల్విక్ (కటి) నుంచి వస్తాయి. కొన్ని సార్లు వృద్ధుల మూత్రాశయంలో కనిపిస్తాయి. ఈ కణాలు అధిక పరిమాణంలో ఉండడం UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం)కి సంకేతం కావొచ్చు.

మూత్ర ఎపిథీలియల్ కణాల పరీక్ష ఎందుకు అవసరం?

రొటీన్ చెకప్​లో భాగంగా యూరిన్ ఎపిథీలియల్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక వ్యక్తికి యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీలు పని చేయకపోవడం వంటి సమస్యలు ఉంటే ఈ పరీక్ష చేయించుకోమని డాక్టర్ రికమెండ్ చేస్తారు.

  • తరచుగా మూత్రవిసర్జన మరియు పెయిన్ (బాధాకరమైన) మూత్రవిసర్జన
  • వెన్ను నొప్పి
  • గర్భాశయ నొప్పి

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో వెన్నునొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

పరీక్ష ఫలితాల వివరణ

ఫలితాలు ఎక్కువగా అధిక స్థాయిల్లో ఉన్నట్లు గుర్తించబడతాయి.

సహజంగా ఎపిథీలియల్ కణాలు శరీరం నుంచి తొలగించబడతాయి. మూత్రంలో కొన్ని పొలుసుల (చేపల పొలుసుల వలే ఉండే కణాలు) కణాలు ఉండడం సహజం. కానీ మూత్రంలో అధిక మోతాదులో ఎపిథీలియల్ కణాలు (HPF కు 15 కంటే ఎక్కువ టూబులర్ కణాలు) ఈ కింది వాటిని సూచిస్తాయి.

  • యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌ (మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం)
  • ఈస్ట్ ఇన్ఫెక్షన్ (యోనిలో సంభవిస్తుంది)
  • లివర్ (కాలేయ సంబంధిత) వ్యాధి
  • కిడ్నీ వ్యాధి
  • క్యాన్సర్

పరీక్ష ఫలితాలు సాధారణ పరిస్థితిలో లేకుంటే చికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉందని అర్థం. ఇంకా కొన్ని పరీక్షలు చేయించుకుంటే సరైన రోగనిర్ధారణ వస్తుంది. ఫలితాల వివరణ కోసం వైద్యుడిని సంప్రదించండి.

మూత్రంలో సాధారణ ఎపిథీలియల్ కణాలు

మూత్రంలో ఎపిథీలియల్ కణాల సాధారణ స్థాయి అధిక శక్తి కేంద్రానికి (HPF) 15 నుంచి 20 కంటే తక్కువగా ఉంటుంది.

అధికంగా ఉన్న ఎపిథీలియల్ కణాలతో ప్రమాద కారకాలు

ఒక వ్యక్తి తన మూత్రంలో అధిక సంఖ్యలో ఎపిథీలియల్ కణాలను కలిగి ఉంటే.. వారు కింది అనారోగ్య ప్రమాదాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

  • మధుమేహం
  • కిడ్నీల్లో రాళ్లు
  • కిడ్నీ వ్యాధుల చరిత్ర
  • అధిక రక్తపోటు
  • తరచుగా సంభవించే UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం)
  • బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ
  • విస్తరించిన ప్రొస్టేట్ (పురుషులలో ఉండే ఒక గ్రంథి వీర్యం తయారీకి ఉపయోగపడుతుంది)

చికిత్సలు ఏమిటి?

చికిత్స అనేది మన మూత్రంలో ఉన్న ఎపిథీలియల్ కణాల స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మూత్రంలో అధిక స్థాయిలో ఎపిథీలియల్ కణాలు ఉండేందుకు ఒక కారణం UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం). UTI చికిత్సలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులు ఉంటాయి. మూత్రపిండాల వ్యాధికి మూలకారణాన్ని బట్టి వివిధ రకాల చికిత్సలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు, బరువు తగ్గడం, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి సిఫారసు చేయబడ్డాయి.

నివారణ

అధిక స్థాయి ఎపిథీలియల్ కణాలకు కారణమయ్యే పరిస్థితులను నివారించేందుకు హైడ్రేటెడ్​గా ఉండడం చాలా ముఖ్యం. రోజుకు అనేక గ్లాసుల నీటిని తాగడం ఉపయోగకరంగా ఉంటుంది. క్రాన్​బెర్రీ (బెర్రీలలో ఒక రకమైనవి) జ్యూస్​లో అనేక యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం) తగ్గించుకునేందుకోసం వీటిని చాలా మంది ఇంటి నివారణలుగా (హోమ్ రెమిడీస్) ఉపయోగిస్తారు.

సారాంశం

మూత్ర పరీక్ష చేసినపుడు మూత్రంలో ఎపిథీలియల్ కణాలను చూపిస్తే అది కలుషితమైన నమూనా కావొచ్చు. మూత్రంలో ఎపిథీలియల్ కణాల పెరుగుదల UTI(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌–– మూత్రవ్యవస్థలోని ఏదైనా భాగం చెడిపోవడం) లేదా కిడ్నీ సమస్యలకు సంకేతం. UTI లక్షణాలు లేదా ఏవైనా కిడ్నీ సమస్యలు ఉంటే పూర్తి వివరాల కోసం వైద్యుడిని సంప్రదించాలి. కేవలం వైద్యుడు మాత్రమే ఫలితాలను అర్థం చేసుకుని.. తదుపరి చికిత్సను నిర్ణయించగలడు. రోగనిర్ధారణ ఎంత త్వరగా జరిగితే... లక్షణాలను తగ్గించేందుకు చికిత్స అంత వేగంగా ఉంటుంది

References

  1. William H. Kern, M.D., (1961). Epithelial Cells in Urine Sediments, American Journal of Clinical Pathology
  2. Poloni JAT, de Oliveira Vieira A, Dos Santos CRM, Simundic AM, Rotta LN. (2021). Survey on reporting of epithelial cells in urine sediment. NCBI

Tags

Epithelial Cells in Urine in English, Epithelial Cells in Urine in Hindi, Epithelial Cells in Urine in Bengali, Epithelial Cells in Urine in Tamil

ఆరోగ్యకరమైన మూత్ర వ్యవస్థ కోసం తల్లుల నమ్మకమైన ఎంపిక

హైడ్రేషన్ మరియు మూత్ర నాళాల ఆరోగ్యానికి తోడ్పడే ఉత్పత్తులు మీ రోజువారీ సంరక్షణలో సహాయపడతాయి, సౌలభ్యాన్ని అందిస్తాయి.

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

419 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)
MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)

High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest

3773 Moms bought
₹499₹64923% Off
Rating
4.3
(88)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.